పత్రిక ప్రకటన: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ  :  ఫిబ్రవరి 20 నుండి  మార్చి 13, 2019

నిరుద్యోగ యువతి యువకులకు  ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ (EEI ), PJTSAU, రాజేంద్రనగర్ , హైద్రాబాదు  ద్వారా , అగ్రికల్చర్  ఎక్స్టెన్షన్ సర్వీస్  ప్రొవైడర్  శిక్షణ కార్యక్రమం  స్కిల్ డెవెలప్మెంట్  ప్రోగ్రాం క్రింద  25 రోజులు అనగా  ఫిబ్రవరి 20 నుండి  మార్చి 13, 2019 వరకు.  శిక్షణ కొరకు  నిరుద్యోగులు  ఆన్లైన్ (online) లో  ధరఖాస్తు  చేసుకొనవచ్చు.   ఇంటర్  లేదా ఆగ్రికల్చర్  పాలిటెక్నీక్  డిప్లొమా పాస్  అయిన  తెలంగాణ  రాష్ట్ర విద్యార్ధి , విద్యార్థినులు  అర్హులు .  ఈ  కార్యక్రమానికి  ఎంపిక  అయిన వారికి ఉచిత వసతి గృహం  మరియు భోజన  సదుపాయం  శిక్షణ  కాలంలో  ఏర్పాటు  చేయబడును .

శిక్షణ పూర్తయిన  అభ్యర్థులకు  స్వయం  ఉపాధి  అవకాశాలు  కలవు . లేదా  వ్యవసాయ సంబంధిత  ప్రభుత్వ , ప్రెయివేటు మరియు ఎన్ జి వో  సంస్థలలో ఉపాథి  పొందే  అవకాశాలు ఉంటాయి . ఆసక్తి  గల అభ్యర్థులు ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ యొక్క  వెబ్సైట్ (www.eeihyd.org ) నుండి  అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని వారి  యొక్క వివరాలు అప్లికేషన్  లో  నింపి పోస్ట్  ద్వారా  గాని  ఈ -మెయిల్  ద్వారా గాని  పంపగలరు . అప్లికేషన్ పంపడానికి చివరి తేది ఫిబ్రవరి 10, 2019 మరిన్ని  వివరాల కొరకు  EEI  website www.eeihyd.org  ని చూడగలరు . ఈ  శిక్షణా కార్యక్రమ  నిర్వాహకులు డా. ఎస్ . చంద్రశేఖర్ , ప్రొఫెసర్, EEI . మరియు  డా. డి. శిరీష్, అసిస్టెంట్  ప్రొఫెసర్  EEI  కి  సంప్రదించగలరు .

సంప్రదించ వలసిన చిరునామా : ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ (EEI), రాజేంద్రనగర్ , హైదరాబాద్ –  500030.

Ph .No : 040 – 24015368 (ఉ : 10 గంటల  నుండి  సా : 5 గంటల వరకు )

ఈ మెయిల్ : eei1962@yaahoo.in